తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-

ప్రభుత్వ పాఠశాలలు, హాస్టల్స్ లో సమస్యలు, సిబ్బంది పనితీరుపై ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఆకస్మిక తనిఖీలు మొదలుపెట్టారు. విద్యార్థులు ఇబ్బందులు పడకుండా, వారికి అన్ని సౌకర్యాలు సక్రమంగా అందేలా చర్యలు తీసుకుంటున్నారు.
ఆదివారం మధ్యాహ్నం కందుకూరు పట్టణంలోని సాంఘిక సంక్షేమ బాలుర హాస్టల్, పక్కనే ఉన్న TRR కళాశాల బాలికల హాస్టళ్లను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ విద్యార్థులతో మాట్లాడారు. వసతులు, సౌకర్యాలను పరిశీలించారు. తనిఖీ సమయంలో రెండుచోట్ల వార్డెన్లు విధుల్లో లేకపోవడంపై ఎమ్మెల్యే సీరియస్ అయ్యారు. సాంఘిక సంక్షేమ బాలుర హాస్టల్ లో అపరిశుభ్ర వాతావరణాన్ని గమనించిన ఎమ్మెల్యే నాగేశ్వరరావు… పరిసరాలు ఇలా ఉంటే విద్యార్థులకు జబ్బులు రావా అని వార్డెన్ ను నిలదీశారు. ఎప్పటికప్పుడు శుభ్రం చేయించాలని ఆదేశించారు. మెనూ ప్రకారం తమకు ఆహారం పెట్టడం లేదని విద్యార్థులు ఎమ్మెల్యేకి చెప్పారు. ప్రస్తుతం ఉన్న రూములు సరిపోవటం లేదని, చిన్న రూముల్లో 8 మంది ఉండాల్సి వస్తోందని అన్నారు. ప్రభుత్వం అందించిన వాటర్ కూలర్ ను వెంటనే బిగించి అందుబాటులోకి తేవాలని ఎమ్మెల్యే సూచించారు.
తర్వాత టిఆర్ఆర్ కాలేజీ ఆవరణలో బాలికల హాస్టల్ ను కూడా నాగేశ్వరరావు తనిఖీ చేశారు. అక్కడ కూడా మెనూ పాటించడం లేదని విద్యార్థులు ఎమ్మెల్యేకి చెప్పారు. ఆదివారం ఉదయం మెనూ ప్రకారం అల్పాహారంలో గుడ్డు ఇవ్వలేదని, కూరలు చాలినంత పెట్టడం లేదని ఫిర్యాదు చేశారు.హాస్టల్ లో పరిస్థితులను గమనించాక, వార్డెన్లపై ఎమ్మెల్యే నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొద్దిరోజుల క్రితం ఇదే హాస్టల్ ను ఆకస్మికంగా తనిఖీ చేసి, పద్ధతి మార్చుకోవాలని సూచించినప్పటికీ… మీలో మార్పు రాలేదని అసహనం చెందారు. అక్కడినుంచే జిల్లా అధికారులతో ఫోన్లో మాట్లాడారు. ఎక్కువమంది విద్యార్థినులు హాస్టల్ లో ఉంటున్నట్లు అటెండెన్స్ ఎందుకు వేశారని వార్డెన్లను ప్రశ్నించారు. ఇదే లాస్ట్ వార్నింగ్. ఈసారి క్షమించడం ఉండదు… యాక్షన్ తప్పదు.. అని ఎమ్మెల్యే వారిని గట్టిగా మందలించారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *