తొలి శుభోదయం ప్రకాశం:-

ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా జిల్లాలో రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో వాహనదారులకు హెల్మెట్ ధరించకపోవడం వల్ల జరిగే ప్రమాదాలు, ప్రాణ నష్టం, కుటుంబాలపై పడే ప్రభావం గురించి పోలీసులు వివరించారు.ఈ సందర్భంగా రెండు చక్రాల వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, అధిక వేగం, నిర్లక్ష్య డ్రైవింగ్, మద్యం సేవించి వాహనం నడపడం వంటి అలవాట్లు ప్రమాదాలకు ప్రధాన కారణాలని అవగాహన కల్పించారు. రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా అనేక విలువైన ప్రాణాలను కాపాడవచ్చని పోలీసులు తెలిపారు.ప్రజలు చట్టాలను గౌరవిస్తూ బాధ్యతాయుతంగా వాహనాలు నడపాలని, తమ కుటుంబ సభ్యుల భద్రత దృష్టిలో ఉంచుకొని హెల్మెట్‌ను తప్పనిసరిగా ఉపయోగించాలని పోలీసులు కోరారు. జిల్లాలో ఇలాంటి అవగాహన కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని స్పష్టం చేశారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *