తొలి శుభోదయం ప్రకాశం:-
రోడ్డు ప్రమాదాల్లో ప్రాణనష్టం తగ్గించడమే లక్ష్యంగాప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ప్రకాశం జిల్లా పోలీసులు జిల్లా వ్యాప్తంగా హెల్మెట్ వినియోగంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించింది. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, అది తమ ప్రాణాలకు ఎంతగానో రక్షణ కల్పిస్తుందని పోలీసులు వివరించారు.ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ నియమాల ప్రాముఖ్యత, హెల్మెట్ ధరించని కారణంగా జరిగే ప్రమాదాలపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా యువత, విద్యార్థులు, ఉద్యోగులు హెల్మెట్‌ను అలవాటుగా చేసుకోవాలని సూచించారు. “హెల్మెట్ – ఇది జరిమానా భయం కోసం కాదు, జీవన భద్రత కోసం” అనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు.పోలీసులు ప్రజలతో నేరుగా మమేకమై, హెల్మెట్ ధరించాల్సిన అవసరాన్ని వివరించడంతో పాటు, రోడ్డుపై సురక్షిత ప్రయాణానికి అవసరమైన సూచనలు అందించారు. రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి అవగాహన కార్యక్రమాలు కొనసాగిస్తామని అధికారులు తెలిపారు.