తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, కంభం పోలీస్ స్టేషన్ ఎస్ఐ నేతృత్వంలో NH 544D జాతీయ రహదారిపైని జంగం గుంట్ల బ్లాక్ స్పాట్ వద్ద హెల్మెట్ లేకుండా వాహనాలు నడపడం, మద్యం సేవించి వాహనం నడపడం (డ్రంక్ డ్రైవ్)పై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై చట్టపరమైన చర్యలు తీసుకున్నారు.ఈ ప్రత్యేక డ్రైవ్లో భాగంగా ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ తప్పనిసరి అని, మద్యం మత్తులో వాహనం నడపడం వల్ల జరిగే ప్రాణాంతక ప్రమాదాలపై స్పష్టమైన అవగాహన కల్పించారు. ప్రమాదాలకు ఎక్కువగా అవకాశం ఉన్న బ్లాక్ స్పాట్ ప్రాంతాల్లో ట్రాఫిక్ నియమాలు పాటించడం ఎంత ముఖ్యమో వివరించారు.అలాగే రహదారి గుండా ప్రయాణించే ప్రజలకు రోడ్డు భద్రతా నియమాలు, ట్రాఫిక్ ఉల్లంఘనల వల్ల కలిగే నష్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వేగ నియంత్రణ, సీటు బెల్ట్ వినియోగం, హెల్మెట్ ధరించడం, మద్యం సేవించి వాహనం నడపకూడదనే అంశాలపై ప్రజలకు సూచనలు చేశారు.ప్రజల ప్రాణభద్రతే ప్రధాన లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసు శాఖ ఇలాంటి ప్రత్యేక తనిఖీలు, అవగాహన కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తుందని, వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించి పోలీసులకు సహకరించాలని అధికారులు కోరారు.