తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-

ప్రకాశం జిల్లా పరిధిలో అక్రమ బాణసంచా గోదాములు మరియు ఇతర స్టాక్ పాయింట్లపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి.హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., అధికారులను ఆదేశించారు.జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న బాణసంచా గోదాములు, నిల్వ కేంద్రాలు, హోల్‌సేల్ దుకాణాలను స్థానిక పోలీసు అధికారులు మరియు సిబ్బంది తనిఖీలు నిర్వహించారు.జిల్లా వ్యాప్తంగా బాణసంచా తయారీ, నిల్వ కేంద్రాలు, తప్పనిసరిగా ప్రభుత్వ నియమ నిబంధనలను పాటించాలని జిల్లా ఎస్పీ శ్రీ వి.హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్ తెలిపారు. ఎస్పీ ఆదేశాలతో ఫైర్ క్రాకర్స్ షాపు నిర్వహకులు ఎక్కువగా క్రాకర్స్ నిల్వలు ఉంచిన వాటిపై ఫైర్ సేఫ్టీ నిబంధనలకు అనుగుణంగా వ్యవహరిస్తున్నారా.. లేదా.. అనేదానిపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది.జిల్లా ఎస్పి ఆదేశాలతో బాణసంచా తయారీ కేంద్రాల్లో, విక్రయ కేంద్రాల్లో పోలీస్ సిబ్బంది ఆకస్మికంగా తనిఖీలు చేశారు.ఫైర్ సేఫ్టీ అధికారులు ఇచ్చిన నిబంధనలకు అనుగుణంగా షాపు నిర్వహిస్తున్నారా.. లేదా అనేది పూర్తి స్థాయి లో పరిశీలించడం జరిగింది.ఎదైన జరగరాని ఘటన జరినప్పుడు షాపులో అమర్చిన ఫైర్ పరికరాలు పని చేస్తున్నాయా లేదా అని చెక్ చేయటం జరిగింది.బాణసంచా తయారీ కేంద్రాల్లో గాని లేదా విక్రయ కేంద్రాల్లో గాని 18 సంవత్సరాలు లోపు పిల్లలను ఉంచరాదని, ఏమైనా అనుకోని సంఘటనలు సంభవించిన ఎడల నివారణ కొరకు నీరు, ఇసుక, తదితర అగ్నిమాపక సామాగ్రిని తప్పనిసరిగా సిద్ధంగా ఉంచుకోవాలని యజమానులకు తెలియ చేసినారు.అంతేకాకుండా తయారీ కేంద్రాలకు ఫైర్ ఇంజన్ సులభంగా చేరుకునేలా మార్గం ఉందా లేదా అనే అంశాన్ని కూడా పోలీసులు పరిశీలించారు.పోలీసు నిబంధనలు ఎవరు ఉల్లంఘించిన అలాంటి వారిపై చట్టపరమైన కఠినమైన చర్యలు తీసుకుంటామవి హెచ్చరించారు.ప్రభుత్వ నియమ నిబంధనలను ఎవరైనా ఉల్లంఘించిన అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామవి హెచ్చరించారు.వివిధ పోలీసు స్టేషన్ పరిధిలో ఉన్న బాణ సంచా తయారీ కేంద్రాలతోపాటు స్టోరేజ్ గోడౌన్లు, విక్రయాల కేంద్రాలను నిరంతరం ఆకస్మికంగా తనిఖీలు చేయాలని ఎస్పీ ఆదేశించారు.నిధి నిర్వహణ లో సిబ్బంది అలసత్వం వహిస్తే పోలీసు సిబ్బందికి చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *