తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
అసెంబ్లీ క్రీడా మహోత్సవం – ఆటవిడుపు కార్యక్రమాల్లో భాగంగా… కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు గురువారం పలు పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో… గౌరవ మంత్రులు, సహచర ఎమ్మెల్యేలతో కలిసి పోటీలను వీక్షిస్తూ సందడి చేశారు. నిత్యం ప్రజా సమస్యలు, బిజీ షెడ్యూల్స్ మధ్య ఇలాంటి ఉల్లాసమైన కార్యక్రమాల్లో పాల్గొనటం ఎంతో ఆనందాన్నిచ్చిందని ఎమ్మెల్యే నాగేశ్వరరావు అభిప్రాయపడ్డారు.