తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-

కందుకూరులోని ప్రభుత్వ ఏరియా వైద్యశాల ప్రాంగణంలో…. కొత్తగా నిర్మించనున్న ఆయుర్వేద వైద్యశాల భవన నిర్మాణానికి కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు సోమవారం శంకుస్థాపన చేశారు. ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో 30 లక్షల రూపాయలతో భవనాన్ని నిర్మించనున్నారు. శంకుస్థాపన అనంతరం, ఆసుపత్రి పరిసరాలను ఎమ్మెల్యే పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. MLA నాగేశ్వరరావు మాట్లాడుతూ పురాతన ఆయుర్వేద చికిత్స విధానాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆయుష్ శాఖను ఏర్పాటు చేసిందని, అందులో భాగంగానే 30 లక్షలతో ఏరియా ఆసుపత్రిలో ఆయుర్వేద వైద్యశాలకు ప్రత్యేక భవనాన్ని నిర్మిస్తున్నారని తెలిపారు.భవనం పూర్తయితే కొత్తగా పంచకర్మ వైద్య సేవలు, అధునాతన లేబరేటరీ ఏర్పాటుతోపాటు అదనపు సిబ్బందిని నియమిస్తారని చెప్పారు.షుగర్, బిపి, థైరాయిడ్, కొలెస్ట్రాల్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులకు ఆయుర్వేద వైద్యం చాలా మంచిదని, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి, అలాంటి వ్యాధులతో బాధపడేవాళ్లు ఈ సేవలను వినియోగించుకోవాలని సూచించారు.వైద్యం అందక ఎవరూ చనిపోకూడదన్న ఉద్దేశంతో, రాష్ట్ర ప్రభుత్వం ప్రజలందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలను తీసుకొచ్చిందని, త్వరలో ప్రతి ఒక్కరికి హెల్త్ కార్డులు అందుతాయని ఎమ్మెల్యే అన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *