తొలి శుభోదయం న్యూస్ గుంటూరు:-

గుంటూరులోని KL యూనివర్సిటీ లో నిర్వహించిన అంతర్జాతీయ ఉమెన్ సమ్మిట్ కార్యక్రమంలో దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ ముఖ్య అతిథిగా పాల్గొని మహిళలను ఉద్దేశించి ప్రసంగించారు.ఈ సందర్భంగా మహిళా సాధికారత, నాణ్యమైన విద్య, ఆరోగ్య పరిరక్షణ, ఆర్థిక స్వావలంబన మరియు రాజకీయాల్లో మహిళల పాత్ర వంటి కీలక అంశాలపై ఆమె సవివరంగా మాట్లాడారు. సమాజ నిర్మాణంలో మహిళల పాత్ర అపారమని, ప్రతి మహిళ తనలోని ప్రతిభను గుర్తించి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని ఆమె ప్రేరణనిచ్చారు.మహిళలకు సమాన అవకాశాలు కల్పించడం ద్వారా దేశం సమగ్ర అభివృద్ధి సాధించగలదని పేర్కొంటూ, యువతులు విద్యతో పాటు నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. సాంకేతిక పరిజ్ఞానం, స్టార్టప్‌లు, స్వయం ఉపాధి రంగాలలో మహిళలు మరింతగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.అలాగే గ్రామీణ ప్రాంత మహిళలకు ప్రత్యేక ప్రోత్సాహం, ఆరోగ్య సేవల విస్తరణ, స్వయం సహాయక సంఘాల బలోపేతం వంటి అంశాలపై ప్రభుత్వాలు మరింత దృష్టి సారించాలని ఆమె అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ ప్రతినిధులు, అధ్యాపకులు, విద్యార్థులు, వివిధ రంగాలకు చెందిన మహిళా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో విజయవంతంగా కొనసాగింది.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *