తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-

అక్రమ జూద కార్యకలాపాలను అరికట్టేందుకు నాగులుప్పలపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు కొనసాగిస్తున్నారు. ఉప్పుగుండూరు గ్రామం పరిసర ప్రాంతాల్లో జూదం జరుగుతున్నట్లు వచ్చిన సమాచారం మేరకు ఎస్‌ఐ గారి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం ఆకస్మిక దాడి నిర్వహించింది.ఈ దాడిలో జూదంలో పాల్గొంటున్న 7 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి రూ. 7,700 నగదు, 7 మొబైల్ ఫోన్లు మరియు 5 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు.పోలీసులు ప్రాంతాన్ని పూర్తిగా తనిఖీ చేసి, అనుమానాస్పద వ్యక్తులు మరియు చట్టవిరుద్ధ కార్యకలాపాలపై కఠిన నిఘా కొనసాగించారు. ఇలాంటి ఆకస్మిక దాడుల ద్వారా అక్రమ జూదాన్ని పూర్తిగా అరికట్టడం లక్ష్యంగా చర్యలు చేపడుతున్నామని అధికారులు తెలిపారు.
ప్రజలు చట్టవిరుద్ధ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, ఇటువంటి సంఘటనలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల భద్రత మరియు శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా పనిచేస్తున్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *