తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:-
ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ సింగరాయకొండ శాఖలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని వెలుగు మహిళా సంఘాల సభ్యులు మరియు బ్యాంక్ కస్టమర్లతో కలిసి నిర్వహించారు.
గ్రామీణ మహిళల ఆర్థిక సాధికారతను ప్రోత్సహించడం మరియు మహిళల విజయాలను గౌరవించడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సన్నెబోయిన శ్రీనివాసులు (బ్రాంచ్ ఎంపెనల్ అడ్వకేట్ మరియు టెంపుల్ చైర్మన్), సన్నెబోయిన రమాదేవి (మాజీ సర్పంచి), ఎం. భాగ్యలక్ష్మి గారు (ఏ పీ ఎం), ఎస్.కె. రసూల్ బీ (ఎం ఎస్ పి ) హాజరై మహిళా స్వయం సహాయక సంఘాల కృషిని అభినందించారు మరియు మహిళలు ఆర్థిక అభివృద్ధిలో మరింత ముందుకు రావాలని ప్రోత్సహించారు.బ్యాంక్ ప్రముఖ కస్టమర్లు కోటపాటి నారాయణ మరియు కుమ్మరి వెంకటేశ్వర్లు కూడా కార్యక్రమానికి హాజరై మహిళా సాధికారతకు తమ మద్దతు తెలిపారు.ఈ కార్యక్రమాన్ని ఏపీజీబీ సింగరాయకొండ మెయిన్ బ్రాంచ్ మేనేజర్ ఎస్. విక్రమ తేజ ఆధ్వర్యంలో నిర్వహించారు.
శాఖ సిబ్బంది, వెలుగు మహిళా సిబ్బంది మరియు పెద్ద సంఖ్యలో మహిళా సంఘ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కుటుంబ సంక్షేమం, ఆర్థిక చేర్పు మరియు సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో ముఖ్యమని ఈ సందర్భంగా పేర్కొన్నారు.మహిళా వ్యాపారవేత్తలను అభినందిస్తూ, మహిళల ఆర్థిక సాధికారతకు బ్యాంక్ నిరంతరం మద్దతు ఇస్తూ సుమారు 60 కోట్లు పైగా మహిళా రుణాలు అందజేసాము, ఇంకా అనేక రుణాల రూపంలో మహిళా అభివృద్ధి కి బ్యాంకు ,మా బ్రాంచ్ ఎప్పుడూ సహకరిస్తాం తెలియజేస్తూ కార్యక్రమం ముగిసింది.