తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-

ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పరిధిలోని శానంపూడి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు గురుకుల ప్రవేశ పరీక్షలో విశేష ప్రతిభ కనబరిచారు. ఈ పాఠశాల నుండి ఏకంగా 11 మంది విద్యార్థులు ఐదవ తరగతిలో గురుకుల పాఠశాలల్లో ప్రవేశం పొందడం గర్వకారణంగా నిలిచింది.
ఈ సందర్భంగా న్యాయవాది పంతగాని వెంకటేశ్వర్లు మాట్లాడుతూ బాలికల విద్య అనేది కేవలం ఒక కుటుంబం అభివృద్ధి కాదు, అది సమాజం మొత్తం పురోగతికి బలమైన పునాది అని, ఒక అమ్మాయి చదివితే ఒక తరం ముందుకు సాగుతుంది అనేది వాస్తవమన్నారు.అదే విధంగా మన రాజ్యాంగం ప్రతి బాలికకు సమాన విద్యా హక్కును కల్పించిందని, ఆ హక్కును కాపాడటం మన అందరి బాధ్యతన్నారు. బాల్య వివాహాలు, చదువు మధ్యలో మానివేయడం వంటి సమస్యలను అరికట్టాలని, ప్రతి తల్లిదండ్రి తమ కుమార్తెలను ఉన్నత విద్య వైపు ప్రోత్సహించాలన్నారు.బాలికల భద్రత, స్వాభిమానానికి విద్యే ప్రధాన ఆధారం అని, విద్య ద్వారా వారు ఆర్థికంగా, సామాజికంగా స్వయం సమృద్ధిగా మారగలరన్నారు.
ప్రభుత్వ పథకాలు, గురుకుల విద్యాసంస్థలు వంటి అవకాశాలను తల్లిదండ్రులు పూర్తిగా వినియోగించుకోవాలని సూచించారు.తమ యొక్క సుదీర్ఘకాల విజన్ ఆంతర్యం ప్రకారం చదువుకున్న బాల బాలికలు రేపటి నాయకులు, వైద్యులు, ఉపాధ్యాయులు, న్యాయవాదులు అవుతారని, కాబట్టి “బాలిక చదువు – దేశానికి వెలుగు” అనే నినాదాన్ని మనం అందరం ఆచరణలో పెట్టి బాలికల విద్యను ప్రోత్సహించాలన్నారు.
చివరిగా, సమాజంలోని ప్రతి ఒక్కరూ బాలికల విద్యకు అండగా నిలిస్తేనే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని పిలుపునిచ్చారు.ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు తమ వంతు బాధ్యతగా ప్రవేశ పరీక్ష స్టడీ మెటీరియల్ మాత్రమే పంపిణీ చేశామని, కానీ ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుని వీరమ్మ సహకారంతో ఆ తరగతి ఉపాధ్యాయులు ఈతముక్కల చిట్టిబాబు విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరిచి ఇంతటి ఘన విజయానికి నాంది పలికారు.
కార్యక్రమంలో మ్యాథ్స్ ఉపాధ్యాయులు మందలపు సురేష్,ప్రధానోపాధ్యాయుని వీరమ్మ, క్లాస్ టీచర్ చిట్టిబాబు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *