తొలి శుభోదయం న్యూస్ కనిగిరి:-
ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు మరియు కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి ఆదేశాల మేరకు, కనిగిరి మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డు కొత్తూరు ప్రాంతంలోని BC కాలనీ మరియు చింతగుంట్ల బజార్లో రూ.14 లక్షల 90 వేల వ్యయంతో మంజూరైన కొత్త డ్రైన్స్ నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులతో కలిసి పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు షేక్ ఫిరోజ్ గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుయువత అధ్యక్షులు అచ్చలా రవి, క్లస్టర్ ఇంచార్జీలు బుల్లా బాబు, షేక్ రహ్మాన్, ఒంగోలు పార్లమెంట్ సహాయక కార్యదర్శి షేక్ షరీఫ్, తెలుగుమహిళ నాయకులు కరణం అరుణమ్మ, వార్డు అధ్యక్షులు పిల్లి కిరణ్ కుమార్ రెడ్డి, రామ సుబ్బారెడ్డి, వెన్న శ్రీనివాసులు రెడ్డి, ఏనుగు శ్రీనివాసులు రెడ్డి, గుడిపాటి ఖాదర్, చొప్పరపు తిరుపతయ్య, కుంచం జాకరయ్య, ముకుంద నాయుడు, వార్డు నాయకులు ఉండేలా శ్రీను, రామకృష్ణ, రమేష్, రవి కుమార్, శ్రీను, అల్లూరి రెడ్డి, బాలాజీ, నాగేంద్ర, అలాగే నాయకులు నీలిశెట్టి అంజి నాయుడు, నాగ పాతూరు, షేక్ నిజాముద్దీన్, చిలకపాటి లక్ష్మయ్య, నరేష్ ముత్యాల, డానియల్, జనార్ధన్, బ్రహ్మం, కిరణ్, మల్లికార్జున, బాలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు డ్రైనేజీ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకున్న ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు.