తొలి శుభోదయం న్యూస్ కందుకూరు :-

కందుకూరు పట్టణంలో నివాసం ఉండే మీరా సాహెబ్ అనే వ్యక్తి కొద్ది కాలంగ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాడు. ఈమధ్య కొద్దిగా అనారోగ్యం ఎక్కువ అవడం వల్ల చికిత్స కోసం ఆర్ధిక పరమైన కారణంగా ఐఎఫ్సి ఫౌండేషన్ వారిని సంప్రదించాడు. కందుకూరు పట్టణంలో మొబైల్ రంగంలో, సేవా రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్న స్నేహశీలి,మృదుస్వభావి సలాం భాయ్ గారు (స్టూడెంట్స్ మొబైల్ అధినేత) విషయం తెలుసుకొని 5000/- ఆర్ధిక సహాయం ఫౌండేషన్ సెక్రటరీ షంషేర్ కి అందచేసి మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ఎవరికైన కష్టం ఉంది అని తెలియగానే తన వంతుగా వారి వివరాలు తెలుసుకొని,వెంటనే స్పందించే సలాం గారు మాట్లాడుతూ ఆర్ధిక పరంగా కష్టాల్లో ఉన్నా వారికి తన వంతుగా,మానవతా సేవా దృక్పథంతో తోచినంత సహాయం అందించడం తనకి ఎంతో ఆత్మ తృప్తి ని ఇస్తుంది అని అన్నారు.ఈ కార్యక్రమం లో ఫౌండేషన్ సభ్యులు పాల్గొని సలాం గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *