తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు పోలీస్:-

మార్కాపురం జిల్లా పోలీస్ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గిద్దలూరులో ఏర్పాటు చేయనున్న నూతన పెట్రోల్ బంక్ నిర్మాణానికి సంబంధించి భూమి పూజ కార్యక్రమం అదివారం జరిగింది. ఈ సందర్భంగా మార్కాపురం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.,గారు వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ కొబ్బరికాయ కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ కొత్తగా మార్కాపురం జిల్లా ఏర్పడిన అనంతరం పోలీస్ సిబ్బంది సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ పెట్రోల్ బంకును ఏర్పాటు చేయడం జరిగిందని,పోలీస్ వెల్ఫేర్ నిమిత్తం ఈ జిల్లాకు అవసరమైన సదుపాయాలను సమకూర్చేందుకు కృషి చేస్తామన్నారు. ప్రజలకు నాణ్యమైన ఇంధనాన్ని అందించాలనే లక్ష్యంతో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) భాగస్వామ్యంతో ఈ పెట్రోల్ బంక్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇది కేవలం పోలీస్ సిబ్బందికే కాకుండా, సాధారణ ప్రజలకు కూడా అందుబాటులో ఉండి, నాణ్యమైన ఇంధనాన్ని అందించనుంది.పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్ ఏర్పాటు చేయడం ఒక స్ఫూర్తిదాయకమైన కార్యక్రమమని పేర్కొన్నారు. ఈ బంక్ ప్రారంభంతో పోలీస్ వాహనాలకు ఇంధనం కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, సమయం ఆదా అవుతుందని, తద్వారా విధుల్లో మరింత సమర్థత పెరుగుతుందని చెప్పారు.ప్రస్తుతం పోలీస్ వాహనాలు ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో నిరంతరం సేవలందిస్తున్న నేపథ్యంలో, ఇంధనం అత్యవసర అవసరమన్నారు. ఈ కొత్త బంక్ ఏర్పాటుతో పోలీస్ వాహనాలకు సకాలంలో ఇంధనం అందుబాటులో ఉండి, అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించే అవకాశం కలుగుతుందని తెలిపారు. ఈ బంక్ ప్రారంభానికి కృషి చేసిన పోలీస్ అధికారులను ఎస్పీ గారు అభినందించారు. నిర్మాణ పనులు సకాలంలో, నాణ్యతతో పూర్తి చేయాలని సంబంధిత సిబ్బందికి సూచనలు చేశారు.ఈ పెట్రోల్ బంక్ ఏర్పాటుకు సహకరించిన ప్రభుత్వ శాఖలు, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ మరియు సంబంధిత అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. త్వరలోనే ఈ పోలీస్ పెట్రోల్ బంక్ ప్రజలకు అందుబాటులోకి రానుందన్నారు.ఈ కార్యక్రమంలో మార్కాపురం డిఎస్పీ యు.నాగరాజు, గిద్దలూరు టౌన్ సీఐ సురేష్, గిద్దలూరు రూరల్ సీఐ రామకోటయ్య, కంభం సీఐ మల్లికార్జున రావు, ఆర్ఐ సీతారామిరెడ్డి, ఎస్సైలు, ఎఆర్ ఎస్సై తిరుపతి స్వామి మరియు సిబ్బంది పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *