తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు :-

జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి శుక్రవారం గుడ్లూరు మండలంలో పర్యటించారు. చేగూరు గ్రామంలో రామదూత ఆశ్రమానికి భూ బదలాయింపు ( అలీనేషన్ ) కోసం క్షేత్రస్థాయి పరిస్థితిని పరిశీలించారు. మార్కెట్ ధర చెల్లిస్తామంటూ ఈ గ్రామంలో 4.93 ఎకరాల భూమి కోసం ఆశ్రమ నిర్వాహకులు ప్రభుత్వాన్ని సంప్రదించారు. ఈ నేపథ్యంలో సర్వే నంబర్ 879-2 లోని భూమిని జాయింట్ కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె వెంట కందుకూరు సబ్ కలెక్టర్ హిమవంశీ, స్థానిక రెవెన్యూ అధికారులు ఉన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *