తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు సతీమణి సౌజన్య పుట్టినరోజు వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పలుచోట్ల కేక్ కట్ చేసిన నేతలు, సౌజన్య కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. పట్టణంలోని టిడిపి కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు ఆధ్వర్యంలో కేక్ కటింగ్ నిర్వహించారు. సౌజన్య ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఆకాంక్షించారు. పట్టణంలోని అన్న క్యాంటీన్లో సౌజన్య పుట్టినరోజు సందర్భంగా మూడు పూటలా అన్నదానం నిర్వహించారు. ఉదయం గుర్రం రాజ్యలక్ష్మి ఆధ్వర్యంలో అల్పాహారం అందించగా, మధ్యాహ్నం పట్టణ ఆర్యవైశ్య మహిళల ఆధ్వర్యంలో అన్న సేవ నిర్వహించారు. సాయంత్రం పట్టణ రేషన్ డీలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్న క్యాంటీన్లో కేక్ కట్ చేసి సౌజన్య కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పేదలకు అన్న సేవ జరిగింది.
ఈ కార్యక్రమాల్లో పట్టణ టిడిపి అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు, అన్న క్యాంటీన్ చైర్మన్ ఉన్నం కొండలరావు, పార్టీ సీనియర్ నాయకులు చిలకపాటి మధు, చదలవాడ కొండయ్య, షేక్ రఫీ, వడ్డెళ్ళ రవిచంద్ర, చుండూరి శ్రీను, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు కల్లూరి శైలజ, పట్టణ మహిళా అధ్యక్షురాలు ముచ్చు లక్ష్మీరాజ్యం, కాకుమాని ప్రవీణ్, కాకుమాని మాల్యాద్రి, రేషన్ డీలర్లు పాల్గొన్నారు.