తొలి శుభోదయం న్యూస్ కందుకూరు

ప్రకాశం జిల్లా కందుకూరులో నూతనంగా కందుకూరు డివిజన్ స్థాయి కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది.. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా యం.ఆర్. మానవ హక్కులు & అవినీతి వ్యతిరేక అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు గుండారెడ్డి మల్లికార్జున రెడ్డి , జాతీయ బోర్డు ఆఫ్ డైరెక్టర్ రొడ్డా తిరుపతయ్య , ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చైర్మన్ షేక్. ఆసిఫ్ భాష , ప్రకాశం జిల్లా చైర్మన్ జి.ఎస్.వి.పి. సాయి చరణ్ తేజ ,ప్రకాశం జిల్లా కన్వీనర్ సయ్యద్ మున్వర్ భాష విచ్చేశారు, అనంతరం నూతన కందుకూరు డివిజన్ కమిటీ గా కందుకూరు డివిజన్ అధ్యక్షులు గా సయ్యద్.గౌస్ భాష , ఉపాధ్యక్షులుగా షేక్.సలాం , డివిజన్ సెక్రటరీ గా కె.జె.నరేంద్ర , జనరల్ సెక్రటరీ గా పి.మనోహర్ గారు,డివిజన మహిళా విభాగం కన్వీనర్ గా పి.మాధవి ని నియమించి సభ్యులకు సంస్థ ఐడి కార్డు,జాయిన్ లెటర్స్ అందజేయడం జరిగింది అనంతరం కందుకూరు డివిజన్ లో కమిటీ సభ్యులు అందరూ మానవ హక్కుల పరిరక్షణ కోసం పనిచేయాలని, మహిళా ల రక్షణ కోసం, బాలల హక్కుల కోసం ప్రత్యేక పని చేయాలని, అదేవిధంగా మన మానవ హక్కుల సంస్థ డెవలప్మెంట్ కోసం మండల స్థాయిలో సభ్యులని జాయిన్ చేసి, సమాజంలో మానవ హక్కులు అవినీతి వ్యతిరేక అసోసియేషన్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం లు చేపట్టాలని జాతీయ అధ్యక్షులు గుండారెడ్డి మల్లికార్జున రెడ్డి సభ్యులకు వివరించారు…కందుకూరు డివిజన్ అధ్యక్షులు సయ్యద్ .గౌస్ భాష మాట్లాడుతూ విద్య వ్యవస్థలో లోపాలు ఉన్నాయా అని,అదీగాక అన్ని ప్రభుత్వ రంగ కార్యాలయాల్లో సమాచార హక్కు చట్టం లాగా , అవినీతి సంస్థ ఆయన ఏ. సీ.బి వారి వారి సమాచారం బోర్డు లు కూడా ఉండేలా చర్యలు తీసుకోవాలని సమావేశంలో తెలియజేయడం జరిగింది…అంతేకాక కందుకూరు డివిజన్ మహిళా విభాగం కన్వీనర్ మాధవి మాట్లాడుతూ మన మానవ హక్కుల సంఘం డివిజన్ లో డెవలప్మెంట్ కోసం పని చేసి సమాజంలో సమస్యల పరిష్కారం కోసం పని చేస్తాం అన్నారు…ఈ కార్యక్రమంలో కందుకూరు డివిజన్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *