తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-
మండల పరిషత్ మోడల్ ప్రాథమిక పాఠశాల, సోమరాజుపల్లిలో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడినాయి. ఈ కార్యక్రమంలో విద్యార్థులు వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు, నృత్యాలు, పాటలు, పద్యాలు మొదలైనవితో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. విద్యార్థులు స్టేజిపై తమ ప్రతిభను ప్రదర్శించినప్పుడు తల్లిదండ్రులు చప్పట్లతో అభినందించారు.
ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను కమిటీ చైర్మన్ మరియు గ్రామ పెద్దలు బహుమతులతో సత్కరించారు. అదేవిధంగా, జీఎఫ్ఎల్ఎన్ కార్యక్రమంలో మండల స్థాయిలో బహుమతి పొందిన విద్యార్థిని ప్రత్యేకంగా అభినందించారు.
గురుకుల పాఠశాలలో సీట్లు సాధించిన విద్యార్థుల విజయంపై గ్రామస్తులు మరియు తల్లిదండ్రులు ఉపాధ్యాయులను అభినందించారు. పాఠశాల అభివృద్ధికి తాము పూర్తి సహకారం అందిస్తామని, ప్రతి ఇంటికీ వెళ్లి విద్యార్థుల నమోదు (ఎన్రోల్మెంట్) పెంచేందుకు కృషి చేస్తామని తల్లిదండ్రులు హామీ ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్యను అందిస్తున్న ఉపాధ్యాయులను ప్రశంసిస్తూ, తమ గ్రామ పాఠశాలను ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు సమష్టిగా కృషి చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు శీలం ప్రసాద్ రావు, రాధేశ్యామ్ , లలిత కుమారి, ఎస్ఎంసి చైర్మన్ శ్రీలక్ష్మి,ప్రధానోపాధ్యాయులు గోనుగుంట నరసింహారావు, అర్రిబోయిన రాంబాబు, జిల్లా ఎం.ఐ.ఎస్ కో ఆర్డినేటర్ మసనం జాలరత్నం,తల్లిదండ్రులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
