తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-

కందుకూరు పట్టణంలో ఉన్న హోటళ్లు మరియు లాడ్జి ల యజమానులతో కందుకూరు సిఐ షేక్ అన్వర్ భాషా, పట్టణ ఎస్సై పులి శివ నాగరాజు కలిసి పోలీస్ కార్యాలయం నందు శనివారం సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ అసాంఘిక కార్యక్రమాలు నిమిత్తం రూములు ఇవ్వరాదని,గుర్తింపు కార్డు లేకుండా రూమ్ లు ఇవ్వరాదని, ఒకవేళ అలాంటి పనులు చేసే వారిని ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు వచ్చినట్లయితే పోలీసు వారికి సమాచారం ఇవ్వాలని సూచించారు. మద్యం సేవించుటకు మరియు వ్యభిచారం నిర్వహించుకొనుటకు పేకాటలు ఆడుకొనుటకు మరియు బెట్టింగ్ లకు ఎట్టి పరిస్థితులలో రూము ఇవ్వకూడదని, ప్రతిరోజు హోటల్లో ఉండే వ్యక్తుల యొక్క సమాచారంను పోలీసు వారికి ఇవ్వాలని తెలిపారు.పై నిబంధనలు ఉల్లంఘించిన యజమానులపై చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం పట్టణ ఎస్సై మాట్లాడుతూ నేర నియంత్రణకు హోటళ్లు మరియు లాడ్జిల యజమానులు సహకరించాలని కోరారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *