తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-

దేశవ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన జేఈఈ మెయిన్స్ 2026 ఫలితాల్లో సింగరాయకొండ లోని స్మార్ట్ జెన్ కాలేజ్ విద్యార్థులు స్థాపించిన మొదటి సంవత్సరంలోనే ఘనవిజయాలను సాధించారు.
పి.మేఘన,ఎన్.నాగ మృదుల, ఎస్. సాయి నేహశ్రీ, పి.నితిన్ జేఈఈ మెయిన్స్ లో అర్హత సాధించారు.ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ గారైన గీతా రాణి మాట్లాడుతూ, జేఈఈ మెయిన్స్- 2026 ఫలితాల్లో మా స్మార్ట్ జెన్ జూనియర్ కాలేజ్ సాధించిన ఘనవిజయం నిరంతర శ్రమకు ప్రతిఫలం, లక్ష్యసాధనకు నిదర్శనం, పట్టుదల అంకిత భావానికి ప్రతీక. అహర్నిశల శ్రమ, క్రమబద్ధమైన ప్రణాళికలతో ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులు ఇంతటి గొప్ప ఫలితాలను సాధించడం గర్వకారణం అని విద్యార్థుల విజయమే మా లక్ష్యం- వారి ఉజ్వల భవిష్యత్తు మా ధ్యేయం.మా విద్యార్థులు భవిష్యత్తులో కూడా ఇలాగే జాతీయ స్థాయిలో మరిన్ని విజయాలు సాధించాలని ఆశిస్తున్నాము. విజయం అనేది ఒక్కరోజులో సాధించేది కాదు ఎన్నో రోజుల పోరాట ఫలితం. ఆ పోరాటంలో విజయం సాధించిన విద్యార్థులకు అభినందనలు అంటూ ప్రసంగించారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *