తొలి శుభోదయం న్యూస్ కందుకూరు :-
మండలం లోని గాలికుంటు నివారణకు సోమవారం నుంచి ఏప్రిల్ మూడో తేదీ వరకు వరకు కోవూరు పశువైద్యశాల పరిధిలోని అన్ని గ్రామాలలో టీకాలను 8 వ విడత జాతీయ గాలికుంటు నివారణకు ఉచితంగా చేయడం జరుగుతుందని కోవూరు పశువైద్యశాల వై. శ్రీకాంత్ తెలిపారు. ఈ కార్యక్రమంను కోవూరులో ప్రారంభించి గేదెలకు టీకాలు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమాన్ని రైతులు సద్వినియం చేసుకోవాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో పశు వైద్య సిబ్బంది పి .విజయ, వి. వేణు, లోకేష్, రాములు, శోభన్ బాబు ,రైతులు పాల్గొన్నారు.