తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ప్రకాశం జిల్లా పోలీసుల,రోడ్డు భద్రతను పెంపొందించడం మరియు ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా అమలు చేయించడం లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసులు ప్రత్యేక ట్రాఫిక్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో వాహనాల తనిఖీలు చేపట్టి, సరైన పత్రాలు లేకుండా నడిపిస్తున్న వాహనాలు, ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘిస్తున్న డ్రైవర్లను గుర్తించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించని వాహనదారులకు రోడ్డు భద్రతపై కౌన్సెలింగ్ నిర్వహించి అవగాహన కల్పించడంతో పాటు, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఈ-చలాన్లు విధించారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించడం, ప్రజల్లో ట్రాఫిక్ నియమాలపై బాధ్యతను పెంపొందించడం మరియు సురక్షితమైన ప్రయాణ సంస్కృతి నెలకొల్పడం లక్ష్యంగా ఇటువంటి ప్రత్యేక డ్రైవ్లు కొనసాగుతాయని పోలీసులు తెలిపారు.