తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-

ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు దర్శి పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాల్లో అసాంఘిక కార్యకలాపాల నిర్మూలనే లక్ష్యంగా పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. గ్రామీణ ప్రాంతాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న అక్రమ బెల్ట్ షాపులపై దర్శి పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న పలువురు నిర్వాహకులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుండి భారీగా మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా, అనుమతి లేకుండా ఎవరైనా మద్యం విక్రయిస్తే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలిస్తామని హెచ్చరించారు. ముఖ్యంగా యువతను పెడదారి పట్టిస్తున్న ఇటువంటి అక్రమ వ్యాపారాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని, ప్రతి గ్రామంలోనూ నిరంతరం నిఘా ఉంటుందని స్పష్టం చేశారు. అక్రమ మద్యం లేదా ఇతర నిషేధిత వస్తువుల గురించి సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలపాలని ప్రజలను కోరారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *