తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-

అఖిలపక్ష పార్టీలు మరియు వలేటివారిపాలెం మండల పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో షెడ్యూల్ కులాలు ప్రజలు క్రైస్తవ మతంలోనికి మారితే SC కులం హోదా కోల్పోతారని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు సమీక్ష చేయాలనీ, కేంద్ర ప్రభుత్వం పుల్ బెంచ్ కు అప్పీల్ కు వెళ్ళాలని, దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ వలేటివారిపాలెం మండల తహసీల్దార్ కు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్బంగా వాళ్ళు మాట్లాడుతూ
భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్ షెడ్యూల్ కులాల ప్రజలు క్రిస్టియన్ మతం లోనికి మారితే భారత రాజ్యాంగం వారికి కల్పించిన రక్షణ చట్టాలు కోల్పోతారని తీర్పు వెలువరించియున్నది. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా భారతదేశాన్ని లౌకిక రాజ్యాంగ మార్చడం జరిగినది అదేవిధంగా రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్ 25 ప్రకారం వ్యక్తులు తమకు నచ్చిన మతాన్ని స్వీకరించే హక్కును కల్పించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు భారత లౌకిక రాజ్యాంగ స్ఫూర్తి కి భిన్నమైనది. దళితులు షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు ప్రజలు క్రైస్తవ్యం తీసుకోవడం వలన సమాజములో వారు కులపరంగా ఎదుర్కొను వివక్షత, అంటరానితనం, అవమానాలు ఏమి రూపు మారటం లేదు సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు వలన దళితులపై కులపరమైన వేధింపులు అత్యాచారాలకు అడ్డుపడకపోగా ఎస్సీలకు సంక్రమించిన రక్షణ చట్టాలు కూడా హరించబడుతున్నాయి అందుకే షెడ్యూల్ కులాల ప్రజలకు క్రైస్తవంలో మారినప్పటికీ కూడా రాజ్యాంగం ఆర్టికల్ 15 లో కల్పించిన విధంగా రక్షణచట్టాలను అమలుచేయాలని కోరారు.ఈ విషయమును కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్ అప్పీల్ కి వెళ్లి షెడ్యూల్ కులాల ప్రజల పట్ల వారి హక్కులను కాపాడే విధంగా చర్యలు తీసుకొవాలని కోరారు.మీ వినతిని తప్పక ప్రభుత్వానికి తెలియజేస్తాను అని తహసీల్దార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వలేటివారిపాలెం మండల పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు దువ్వూరి యాకోబు,అడ్వైజర్ వై.దేవ కుమార్, సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి బూసి.సురేష్ బాబు వైస్ ప్రెసిడెంట్ గళ్ళ శీను,సెక్రటరీ పి. ప్రభాకర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ జి. యోహాను,ఎల్ థామస్,ప్రకాష్ పాల్, జి.డేవిడ్ పాస్టర్ సురేష్ తదితరులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *