తొలి శుభోదయం న్యూస్ దర్శి :-

దర్శి పట్టణం పొదిలి రోడ్‌లో దర్శి సొసైటీ అధ్యక్షులు కలువకొలను చంద్రశేఖర్ (శేఖర్ పంతులు) నూతనంగా ఏర్పాటు చేసిన హీరో షోరూం – సారధి మోటార్స్ ను దర్శి తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు, టిడిపి యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ ఘనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, దర్శి పట్టణ అభివృద్ధికి కొత్త వాణిజ్య సంస్థలు ఏర్పడటం శుభపరిణామమని, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే ఈ షోరూం విజయవంతం కావాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు నారపుశెట్టి పాపారావు ,దర్శి మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య ,దర్శి ఏఎంసి చైర్మన్ దారం నాగవేణి – సుబ్బారావు ,దర్శి పట్టణ టిడిపి అధ్యక్షులు పుల్లలచెరువు సత్యనారాయణ (చిన్న) గా నియోజకవర్గంలోని పలువురు ప్రముఖులు, కూటమి శ్రేణులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *