తొలి శుభోదయం న్యూస్ నెల్లూరు:-
నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం గువ్వాడి గ్రామపంచాయతీ ఐ సి డి ఎస్ ప్రోగ్రాంలో భాగంగా అంగన్వాడి టీచర్ల సమక్షంలో గువ్వాడిగ్రామం నందు పోషణ పక్వాడ కార్యక్రమం జరిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున బాలింతలు, గర్భిణీలు చిన్నపిల్లలు హాజరయ్యారు. కార్యక్రమంలో అంగన్వాడి టీచవిర్ యం.విజయ మాట్లాడుతూ గర్భిణీ మరియు బాలింతల పోషకాహార లోపాలను గురించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని వివరించారు. మంచి విటమిన్ గల ఆహారాన్ని తీసుకోవాలని వివరించారు. అంగన్వాడి సెంటర్ గర్భిణీలు మరియు బాలింతలు, చిన్న పిల్లలు కొరకు గవర్నమెంట్ ఇస్తున్న పాలు, గుడ్లు ,పోషకాహార విటమిన్ గల ఆహారాన్ని తీసుకుని అందరు కూడా సకాలంలో సద్వినియోగం చేసుకోవాలని ,ఎండాకాలం దృష్టిలో ఉంచుకొని వడదెబ్బ భారీన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.