తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-

ప్రకాశం మరియు మార్కాపురం జిల్లాల ప్రజల ప్రాణ–ఆస్తి రక్షణే ప్రధాన లక్ష్యంగా పోలీస్ యంత్రాంగం రాత్రివేళల్లో భద్రతను మరింత బలోపేతం చేసింది. జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు పట్టణాలు, గ్రామాలు, జాతీయ రహదారులపై పోలీసులు ముమ్మరంగా ‘నైట్ బీట్’ (Night Beat) నిర్వహిస్తున్నారు.అర్ధరాత్రి సమయంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తులను నిలదీసి, సాంకేతిక పరిజ్ఞానంతో వారి వివరాలు/వేలిముద్రలు పరిశీలిస్తూ నేరాలకు తావులేకుండా చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా తాళం వేసి ఉన్న ఇళ్లు, బ్యాంకులు, ఏటీఎంలు, వ్యాపార సముదాయాలు వంటి సున్నిత ప్రాంతాల్లో నిరంతర గస్తీ కొనసాగిస్తూ విజిబుల్ పోలీసింగ్ అమలు చేస్తున్నారు.ఈ చర్యలతో దొంగతనాలు, చోరీలు తదితర నేరాలు నివారించడంతో పాటు, ప్రజలకు భద్రతపై విశ్వాసం కలుగుతోంది. ఏదైనా అనుమానాస్పద కదలికలు గమనిస్తే వెంటనే డయల్ 100కు సమాచారం ఇవ్వాలని, నేరరహిత సమాజం నిర్మాణంలో పోలీసులకు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *