తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-

ప్రకాశం మరియు మార్కాపురం జిల్లాల్లో ప్రజల ప్రాణ, ఆస్తి రక్షణను అత్యంత ప్రాధాన్యంగా తీసుకున్న పోలీస్ యంత్రాంగం రాత్రివేళల్లో భద్రతను మరింత బలోపేతం చేసింది. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, పట్టణాలు, గ్రామాలు, జాతీయ రహదారులపై పోలీసులు విస్తృతంగా ‘నైట్ బీట్’ నిర్వహిస్తూ అప్రమత్తంగా విధులు నిర్వర్తిస్తున్నారు.అర్ధరాత్రి సమయంలో అనుమానాస్పదంగా సంచరించే వ్యక్తులను నిలదీసి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వారి వివరాలను తనిఖీ చేస్తున్నారు. తాళం వేసి ఉన్న ఇళ్లు, బ్యాంకులు, ఏటీఎంలు, వ్యాపార సముదాయాల వద్ద నిరంతరం గస్తీ కాస్తూ దొంగతనాలకు అడ్డుకట్ట వేస్తున్నారు.‘విజిబుల్ పోలీసింగ్’ ద్వారా ప్రజల్లో భరోసా కల్పిస్తూ, ఎక్కడైనా అనుమానాస్పద కదలికలు కనిపించిన వెంటనే డయల్ 100కు సమాచారం అందించాలని పోలీసులు సూచిస్తున్నారు. ప్రజల సహకారంతో నేరరహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *