తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-

శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ మరియు అసాంఘిక కార్యకలాపాలకు పూర్తిస్థాయిలో అడ్డుకట్ట వేయాలనే లక్ష్యంతో ప్రకాశం జిల్లా పోలీసులు మరియు మార్కాపురం జిల్లా పోలీసులు సంయుక్తంగా కట్టుదిట్టమైన కార్డన్ & సెర్చ్ ఆపరేషన్‌ను నిర్వహించారు. జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.ఆదేశాల మేరకు, పెద్దారవీడు, మార్కాపురం టౌన్, పామూరు, కొండపి, కందుకూరు రూరల్, మద్దిపాడు, అద్దంకి తదితర ప్రాంతాల్లో ఈ తనిఖీలు చేపట్టారు.ఈ ఆపరేషన్‌లో భాగంగా అనుమానిత వ్యక్తులు, పాత నేరస్తుల నివాసాలు, గ్రామ శివారులు, ప్రధాన కూడళ్లు, దుకాణాలు తదితర ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాల సహాయంతో విస్తృత స్థాయిలో తనిఖీలు నిర్వహించారు. తనిఖీల సమయంలో సరైన పత్రాలు లేని ద్విచక్ర వాహనాలు మరియు ఇతర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.నేరాలను ముందస్తుగా నిరోధించడం, ప్రజల్లో భద్రతాభావాన్ని పెంపొందించడం పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు. జిల్లావ్యాప్తంగా తరచుగా నిర్వహించే ఈ తరహా కార్డన్ & సెర్చ్ ఆపరేషన్లకు ప్రజలు పూర్తి సహకారం అందించాలని కోరారు. తమ పరిసరాల్లో ఎలాంటి చట్ట వ్యతిరేక చర్యలు, అసాంఘిక కార్యకలాపాలు లేదా అనుమానాస్పద వ్యక్తుల సమాచారం తెలిసిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్ 112 / 100 నంబర్లకు తెలియజేయాలని సూచించారు.ఈ కార్డన్ & సెర్చ్ కార్యక్రమంలో సీఐలు, ఎస్సైలు మరియు పోలీస్ సిబ్బంది సమన్వయంతో పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *