తొలి శుభోదయం న్యూస్ దర్శి పోలీస్:-
నేరాల నియంత్రణను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు దర్శి సబ్‌డివిజన్ పరిధిలో డీఎస్పీ గారు సమగ్ర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో దర్శి సర్కిల్ సీఐ, ఎస్సైలు, టెక్నికల్ అసిస్టెంట్లు (TAs) మరియు ఐటి కోర్ సిబ్బంది పాల్గొన్నారు.సమావేశంలో భాగంగా CCTNS అప్లికేషన్ వినియోగం, e-Sakshya డేటా అప్‌లోడ్, MedLEaPR సిస్టమ్ వినియోగంపై సమీక్ష నిర్వహించారు. అదేవిధంగా మిస్సింగ్ మొబైల్స్ కేసులు, 60 రోజుల మరియు 90 రోజులలోపు పెండింగ్‌లో ఉన్న కేసుల పరిష్కారం, స్వర్ణాంధ్ర పోర్టల్‌లో నమోదు మరియు అప్‌డేట్స్‌పై అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం ఇచ్చారు.ప్రివెంటివ్ పోలీసింగ్ చర్యలను సమర్థవంతంగా అమలు చేయాలని, ప్రతి కేసును సమయపాలనతో పూర్తి చేసి, డేటా అప్‌డేట్స్ సక్రమంగా నిర్వహించాలని డీఎస్పీ సూచించారు. ఆధునిక సాంకేతికతను వినియోగించి నేరాల నియంత్రణలో మెరుగైన ఫలితాలు సాధించాలని ఆదేశించారు.పోలీస్ సిబ్బంది సమన్వయంతో పనిచేసి, ప్రజలకు వేగవంతమైన మరియు సమర్థవంతమైన సేవలు అందించాలని డీఎస్పీ తెలిపారు.