తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-

జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా తాళ్లూరు, మండలం పాముల కాలనీలో పోలీసులు భారీ కార్డన్ సెర్చ్ (Cardon Search) నిర్వహించారు. గౌరవనీయులైన దర్శి సర్కిల్ ఇన్స్పెక్టర్ (CI) పర్యవేక్షణలో, తాళ్లూరు, ఎస్.ఐ., ముండ్లమూరు ఎస్.ఐ. మరియు పోలీస్ సిబ్బంది ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. తెల్లవారుజాము నుండే కాలనీని చుట్టుముట్టిన పోలీసులు, ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు.ఈ తనిఖీల్లో భాగంగా సరైన పత్రాలు లేని అనుమానాస్పద వాహనాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు, పాత నేరస్థుల కదలికలపై నిఘా ఉంచారు. కాలనీ వాసులతో ముఖాముఖి మాట్లాడి, ఎవరైనా కొత్త వ్యక్తులు లేదా అనుమానితులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. “గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణే మా ప్రాధాన్యత” అని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా అధికారులు హెచ్చరించారు. విజిబుల్ పోలీసింగ్‌లో భాగంగా నిర్వహించిన ఈ ఆపరేషన్ ద్వారా ప్రజలకు భద్రతపై భరోసా కల్పించారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *