తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు :=
నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (NEP 2020)లో భాగంగా ప్రకాశం జిల్లా సెంట్రల్ నోడల్ ఆఫీసర్గా నియమితులైన శ్రీ గయాస్ ఉద్దీన్ అహ్మద్ (IDAS) గారు గురువారం జిల్లాలో పర్యటించారు. ఇందులో భాగంగా కొండేపిలోని పీఎం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గురుకులం మరియు ఒంగోలులోని పీఎం కేంద్రీయ విద్యాలయాన్ని సందర్శించి, అక్కడి విద్యా ప్రమాణాలు మరియు సదుపాయాల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ పి. రాజబాబు మరియు జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి తో కలిసి జిల్లాలోని 50 పీఎం పాఠశాలల పురోగతిపై ప్రత్యేకంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో డి ఈ ఓ సి.వి. రేణుక, ఏపిసి అనిల్ కుమార్ దాసరి మరియు ఇతర విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.