తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు :-
రాష్ట్ర హోం మంత్రి శ్రీమతి వి.అనిత ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ఎండల తీవ్రత వల్ల ఒక్క ప్రాణం కూడా పోకూడదన్నదే లక్ష్యంగా అధికారులకు దిశానిర్దేశం చేశారు.
కలెక్టర్ కీలక ఆదేశాలు కార్మికుల రక్షణ: ఉపాధి హామీ పనుల సమయాల్లో మార్పులు, మధ్యాహ్నం ఎండలో పనులు నిలిపివేత. నీటి వసతి: ప్రతి గ్రామంలో త్రాగునీటి బోర్ల మరమ్మతులు, పశువుల తొట్టెల్లో నీరు ఉండేలా చూడటం.రహదారి సౌకర్యాలు: ప్రధాన జంక్షన్లలో ఎండ నుండి రక్షణకు ‘షేడ్స్’ (Shades) ఏర్పాటు. ఆరోగ్య జాగ్రత్తలు: చిన్నారులు, వృద్ధుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని DMHO కి సూచన.