మంత్రి స్వామి చొరవతో పెండింగ్ లో ఉన్న దివ్యాంగుల ప్రత్యేక బ్యాక్ లాగ్ class-iv ఉద్యోగాలు భర్తీ
ఉద్యోగాలు పొందిన నలుగురుకి తూర్పు నాయుడుపాలెం క్యాంపు కార్యాలయంలో ఉత్తర్వులు అందజేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి
సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి స్వామికి కృతజ్ఞతలు తెలిపిన దివ్యాంగులు
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం / తూర్పు నాయుడుపాలెం :-
ప్రకాశం జిల్లాలో 2021-22 & 2022-23 సంవత్సరాలలో పెండింగ్ లో ఉన్న దివ్యాంగుల ప్రత్యేక బ్యాక్ లాగ్ class-iv ఉద్యోగాలు కూటమి ప్రభుత్వం భర్తీ చేసింది. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మరియు దివ్యాంగులు వయోవృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, కలెక్టర్ పి.రాజాబాబు చొరవతో పెండింగ్ లో ఉన్న దివ్యాంగుల ప్రత్యేక బ్యాక్ లాగ్ class-iv ఉద్యోగాలు భర్తీ అయ్యాయి. ఉద్యోగాలు పొందిన నలుగురుకి ఆదివారం నాడు తూర్పు నాయుడుపాలెం క్యాంపు కార్యాలయంలో మంత్రి డిఎస్ బీవీ స్వామి నియామక ఉత్తర్వులు అందజేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి స్వామికి దివ్యాంగులు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ….రాష్ట్రంలో ఖాళీగా ఉన్న దివ్యాంగుల బ్యాక్ లాగ్ పోస్టులు త్వరలోనే భర్తీ చేస్తాం. దివ్యాంగులకు రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా 1750 త్రీవీలర్ మోటార్ బైక్ లు మార్చి నెలలో పంపిణీ చేయనున్నాం.దివ్యాంగులకు వీల్ చైర్లు, సహాయ పరికరాలు, విద్యార్థులకు ల్యాప్ టాప్ లు, సెల్ ఫోన్లు పంపిణీ చేస్తున్నాం. దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు సీఎం చంద్రబాబు నాయుడు ఇంద్రధనస్సు కార్యక్రమం తీసుకొచ్చారు. బడ్జెట్ లో దివ్యాంగుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిచ్చాం.దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పిస్తున్నాం. దివ్యాంగుల సౌకర్యార్థం రాష్ట్రంలోని అన్ని బస్టాండ్ లలో వీల్ చైర్లు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడతాం. ప్రకాశం జిల్లాలో దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా ఒక హాస్టల్ నిర్మిస్తాం. దివ్యాంగుల అభివృద్ధి, సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందనిమంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు.
