తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ,:-

జాతీయ రహదారి, రాష్ట్ర, గ్రామ పంచాయతీ రహదారులపై ఆటోలో నడిపే చోదకులు వాహన దారులు ప్రజల, వాహన చోదకుల ప్రాణాలు ప్రథమ ప్రాధాన్యం గా తీసుకుని తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని హితవు చెప్తూ నిబంధనలు పాటించని వారి పై చర్యలు తప్పవని సింగరాయకొండ సిఐ చావా హాజరత్తయ్య హెచ్చరించారు. మంగళవారం సింగరాయకొండ పోలీస్ సర్కిల్ కార్యాలయం లో ఆటో చోదకులు వాహనదారుల అవగాహన సమావేశం లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఐ ఆటో చోదకులకు ట్రాఫిక్ నిబంధనలు, నియమాలు, ప్రజల, వాహన చోదకుల ప్రాణాలు ప్రాధాన్యం గురించి అవగాహన కల్పించారు. ఆటో నడిపే వారు వారు నడిపే ఆటో కి సంబంధించి లైసెన్స్, ప్రమాద బీమా, ట్రాఫిక్ నిబంధనలు, ప్రత్యేకంగా కాకి చొక్కా తప్పనిసరి అని ప్రతి ఒక్కరూ గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ వాహనాలు నడుపుకోవాలని ఆయన హితవు చెప్పారు. ప్రజల ప్రాణాలకు భద్రతే కాదు ప్రతి ఆటో చోదకుడి వెనుక కుటుంబం ఉన్న సంగతి గమనం లో పెట్టుకోవాలని సిఐ సూచించారు. ఆటో డ్రైవర్లు, నిర్వాహకులు నిబంధనలు పాటించాలని దానికి భిన్నంగా వ్యవహరిస్తే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. ఈ సందర్భంగా సింగరాయకొండ కేంద్రంగా నడిపే చోదకులు వాహనదారులు అవగాహన కార్యక్రమం లో పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *