తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ప్రజల భద్రతను మరింత బలోపేతం చేయడంలో భాగంగా ప్రకాశం జిల్లా పోలీసులు బస్ స్టాండ్ మరియు రైల్వే స్టేషన్‌లలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.ఈ తనిఖీల్లో అనుమానాస్పద వ్యక్తులను గుర్తించి వారి వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు.ప్రయాణికులు ఎలాంటి భయం లేకుండా ప్రయాణాలు సాగించేందుకు, నేరాలను ముందస్తుగా అరికట్టేందుకు ఈ తనిఖీలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.శాంతి భద్రతల పరిరక్షణకు ప్రకాశం జిల్లా పోలీస్ యంత్రాంగం నిరంతరం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.