తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:-

కంభం: మార్కాపురం జిల్లా కేంద్రంలో ఈ నెల 18న ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం భారీ స్థాయిలో ధర్నా నిర్వహించనున్నట్లు ఏపీటీఎఫ్ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని పిలుపునిచ్చారు. జిల్లా అధ్యక్షులు నాయబ్ రసూల్,జిల్లా ప్రధాన కార్యదర్శి కె. మల్లికార్జునరావు, జిల్లా కార్యదర్శి రంగస్వామి మాట్లాడుతూ, ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, విద్యారంగ సమస్యలు,ఆర్థిక సమస్యలు,సాధారణ సమస్యలతో పలువురు మానసిక ఒత్తిడికి గురవుతున్నారని,సమస్యల పరిష్కారానికి పోరాటమే మార్గమన్నారు. ఈ సందర్భంగా కంభం మండల అధ్యక్షుడు మరియు ప్రధాన కార్యదర్శులు భాస్కర్ నాయుడు, త్రివిక్రమ్ రావు ఈ నెల 18న మార్కాపురం జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న ధర్నాను విజయవంతం చేయడానికి మండలంలోని , ఉపాధ్యాయులు అందరూ పాల్గొనాలని కోరారు.
ఈ కార్యక్రమానికి సీనియర్ నాయకులు పగడాల పాండు, అబ్దుల్ కలాం మద్దతు తెలుపుతూ, ఉపాధ్యాయ హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు.
ధర్నా కార్యక్రమంలో పలు సమస్యలపై నిరసన వ్యక్తం చేయడంతో పాటు, ప్రభుత్వానికి వినతి పత్రం సమర్పించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. జిల్లాలోని అన్ని మండలాల నుండి ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఏపీటీఎఫ్ నాయకులు పిలుపునిచ్చారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *