తొలి శుభోదయం న్యూస్ బాపట్ల:-
బాపట్ల ఇంజనీరింగ్ కళాశాల (BEC) ఆవరణలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు అత్యంత ఉత్సాహంగా, ఘనంగా జరిగాయి. కళాశాల మహిళా సాధికారత విభాగం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (SDSC-SHAR) జనరల్ మేనేజర్ ఎం.ఎస్. శాంతి విచ్చేశారు. ఈ కార్యక్రమానికి బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటి అధ్యక్షులు శ్రీ ముప్పలనేని శ్రీనివాసరావు , సెక్రటరీ శ్రీ మానం నాగేశ్వరరావు , జాయింట్ సెక్రటరీ దొప్పలపూడి వెంకయ్య చౌదరి, కోశాధికారి కోట వీరబ్రహ్మం మరియు బాపట్ల ఎడ్యుకేషనల్ సొసైటీ ఇతర పాలకవర్గ సభ్యులు, కళాశాల ప్రిన్సిపాల్ బి. శ్రీనివాస రావు మరియు సీనియర్ అధ్యాపకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ముప్పలనేని శ్రీనివాసరావు మాట్లాడుతూ, “మహిళలు అన్ని రంగాలలోనూ పురుషులతో సమానంగా రాణిస్తున్నారు, వారిని ప్రోత్సహించడం మనందరి బాధ్యత” అని అన్నారు. మానం నాగేశ్వరరావు మాట్లాడుతూ, “మహిళల శక్తి సామర్థ్యాలను గుర్తించి వారికి సరైన అవకాశాలు కల్పించాలి” అని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిథి ఎం.ఎస్. శాంతి మాట్లాడుతూ, ప్రస్తుత సమాజంలో మహిళలు అంతరిక్ష పరిశోధనల నుండి అట్టడుగు స్థాయి వరకు అన్ని రంగాల్లోనూ తమ ప్రతిభను చాటుతున్నారని కొనియాడారు. 2026 అంతర్జాతీయ మహిళా దినోత్సవ నినాదమైన “Give to Gain” (మహిళాభ్యుదయానికి సహకరించండి – సమాజ ప్రగతిని పొందండి) గురించి వివరిస్తూ, మహిళలకు తగినంత ప్రోత్సాహం, అవకాశాలు కల్పిస్తే దేశం మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. విద్యార్థినులు కేవలం చదువుకే పరిమితం కాకుండా, నాయకత్వ లక్షణాలను అలవర్చుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆమె పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా,కళాశాల ప్రిన్సిపాల్ బి. శ్రీనివాస రావు మాట్లాడుతూ”మహిళలు తమ లక్ష్యాలను సాధించడానికి దృఢ సంకల్పంతో ముందుకు సాగాలి అని , ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోవాలి” అని మరియు కళాశాల మహిళా విద్యార్థుల అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తుంది”అని అన్నారు.” ఉమెన్ ఎంపవర్మెంట్ కన్వీనర్ శ్రీమతి జే వెంకటలక్ష్మి మాట్లాడుతూ, “మహిళలు సమాజానికి వెన్నెముక వంటివారు అని వారిని గౌరవించడం మన సంస్కృతి” అని అన్నారు. మహిళల కోసం ప్రత్యేకంగా నిర్వహించిన ఆటల పోటీలలో గెలుపొందిన విజేతలకు ముఖ్య అతిథి బహుమతులు అందజేశారు
ఈ వేడుకలకు ఈఈఈ విభాగపు అధిపతి డాక్టర్ ఎన్
రమాదేవి , ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ కన్వీనర్ సి.హెచ్. మారుతీ దేవి, ఎన్ఎస్ఎస్ యూనిట్ 3 ప్రోగ్రాం ఆఫీసర్ వై శృతి , డీన్ ఆఫ్ స్టూడెంట్ అఫైర్స్ ప్రొఫెసర్ డి నిరంజన్ బాబు , మహిళ అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది మరియు విద్యార్థినిలు పాల్గొన్నారు.