తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
అక్రమ జూద కార్యకలాపాలను అరికట్టేందుకు దొనకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు కొనసాగిస్తున్నారు. మల్లంపేట గ్రామ పరిసర ప్రాంతాల్లో జూదం జరుగుతున్నట్లు వచ్చిన సమాచారం మేరకు ఎస్‌ఐ గారి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం ఆకస్మిక దాడి నిర్వహించింది.ఈ దాడిలో జూదంలో పాల్గొంటున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి రూ. 4,050 నగదు, 4 మోటార్ సైకిళ్లు మరియు 2 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.పోలీసులు ప్రాంతాన్ని పూర్తిగా తనిఖీ చేసి, అనుమానాస్పద వ్యక్తులు మరియు చట్టవిరుద్ధ కార్యకలాపాలపై కఠిన నిఘా కొనసాగించారు. ఇలాంటి ఆకస్మిక దాడుల ద్వారా నేరాలను అరికట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని అధికారులు తెలిపారు.ప్రజలు చట్టవిరుద్ధ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, అనుమానాస్పద సంఘటనలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల భద్రత మరియు శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటారని తెలిపారు.