తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం & మార్కాపురం పోలీస్ :-

మహిళలు మరియు చిన్నారుల భద్రత కోసం జిల్లా పోలీస్ యంత్రాంగం సరికొత్త కార్యాచరణతో ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా మార్కాపురం మరియు ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ల వద్ద ప్రయాణికులకు ‘శక్తి యాప్’ (Shakthi App) పై విస్తృత అవగాహన కల్పించారు. ఒంగోలు హెడ్ క్వార్టర్స్ టీమ్-1 ఆధ్వర్యంలో బస్సుల్లో ప్రయాణించే మహిళలకు, కళాశాల విద్యార్థినులకు ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేయించి, అత్యవసర సమయంలో పోలీసుల సాయం ఎలా పొందాలో లైవ్ డెమో ద్వారా వివరించారు.అదేవిధంగా, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గురుకుల బాలికల పాఠశాలలో విద్యార్థినుల కోసం ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు చిన్నారులకు ‘గుడ్ టచ్ – బ్యాడ్ టచ్’ (Good Touch & Bad Touch) గురించి సున్నితంగా మరియు సులభంగా అర్థమయ్యేలా వివరించారు. ఎవరైనా అనుచితంగా ప్రవర్తిస్తే భయపడకుండా తల్లిదండ్రులకు లేదా ఉపాధ్యాయులకు తెలియజేయాలని, వెంటనే డయల్ 100 లేదా 112 కు సమాచారం అందించాలని సూచించారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, చట్టాలపై అవగాహన కలిగి ఉండటమే నిజమైన రక్షణ అని పోలీసులు ఈ సందర్భంగా పేర్కొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *