తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
కందుకూరు రూరల్ మండలం మాచవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ప్రధానమంత్రి టీబి ముక్తభారత్ కార్యక్రమంలో భాగంగా 2025 సంవత్సరమునకు గాను ఆరు గ్రామపంచాయతీలు క్షయ రహిత పంచాయతీలుగా ఎంపిక కాబడినవి . ప్రతి 1000 మంది జనాభాలో కనీసం 30 నుండి 50 మందికి కళ్ళే నమూనాలు సేకరించి పరీక్షలు చేయడం జరిగిందని అందులో ఒకరికి కూడా పాజిటివ్ లేనందున వాటి ఆధారంగా క్షయ రహిత పంచాయతీలుగా ఎంపిక కాబడినవని వాటి పరిశీలనలో భాగంగా మండల వైద్యాధికారి డాక్టర్ సిహెచ్.రాకేష్ కుమార్ ఆధ్వర్యంలో పందలపాడు , జిల్లెల్లమూడి, నరిశెట్టి వారి పాలెం , విక్కిర్యాలపేట,బలిజ పాలెం తదితర గ్రామాలలో టీబి సూపర్వైజర్ల బృందం ఆయా గ్రామాలను సందర్శించి పరిశీలించడమైనది . ఈ కార్యక్రమంలో ల్యాబ్ సూపర్వైజర్ కే.శివాజీ , ఎస్ . టి.ఎస్ కే. శ్రీమన్నారాయణ, హెల్త్ సూపర్వైజర్ , యం.శ్రీనివాసరావు, హెల్త్ అసిస్టెంట్ కె.వి.కిరణ్ కుమార్, శరత్ బాబు , పంచాయతీ సెక్రటరీలు , ఏఎన్ఎంలు , సిహెచ్ వోలు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.