తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, మార్కాపురం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్సై ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది మరియు రోడ్ సేఫ్టీ వారియర్స్‌తో కలిసి ప్రత్యేక ట్రాఫిక్ డ్రైవ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హెల్మెట్ ధరించని ద్విచక్ర వాహనదారులు, అతివేగంగా వాహనాలు నడిపే వారు, రాంగ్ రూట్ డ్రైవింగ్ చేసే వారిని నిలిపి ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. అలాగే వాహనాల రికార్డులను పరిశీలించి నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై జరిమానాలు విధించారు. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా ట్రాఫిక్ నియమాలు పాటించాలని పోలీసులు సూచించారు.