తొలి శుభోదయం ప్రకాశం :-
ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, చీమకుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో సీఐ గారి ఆధ్వర్యంలో స్పెషల్ పార్టీతో కలిసి ప్రకాశం జిల్లా పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఈ డ్రైవ్ సందర్భంగా హెల్మెట్ ధరించకుండా ప్రయాణించిన ద్విచక్ర వాహనదారులను నిలిపి కౌన్సెలింగ్ కార్యక్రమం నిర్వహించి, రోడ్డు ప్రమాదాల్లో హెల్మెట్ ప్రాధాన్యతను వివరించారు. అలాగే ఇతర ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులకు కూడా అవగాహన కల్పించారు. నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై చట్టప్రకారం తగిన చలాన్లు విధించబడినట్లు పోలీసులు తెలిపారు. రోడ్డు భద్రతకు ప్రజల సహకారం అత్యంత అవసరమని సీఐ పేర్కొన్నారు.