తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం.
జిల్లా కేంద్రమైన మార్కాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ గా ఎస్ కె అల్తాఫ్ హుస్సేన్ నియమితులయ్యారు.
ఈ మేరకు డిఐజి కార్యాలయం నుండి అధికారికంగా ఉత్తర్వులు వెలువడ్డాయి.
ఈయన గతంలో పెద్ద దోర్నాల, అర్ధవీడు, రాచర్ల , పొదిలి, నాగులుప్పలపాడు, ఒంగోలు తాలూకా ఏరియాల్లో ఎస్ ఐ గా పని చేశారు.
ఎస్ఐ నుండి సీఐ గా పదోన్నతి పొందిన ఈయన నెల్లూరు జిల్లాలో కొంత కాలం పని చేశారు.
ఇది ఇలా ఉండగా ఇప్పటివరకు సీఐ గా పని చేసిన పి. సుబ్బారావు ఒంగోలు లోని ఎస్పీ కార్యాలయానికి వీఆర్ కు వెళ్లిన విషయం తెలిసిందే.
నేడు బాధ్యతలు స్వీకరణ.
సీఐ గా నియమితులైన ఎస్ కె. అల్తాఫ్ హుస్సేన్ ఈ నెల 26 వ తేదీ ఆదివారం ఉదయం సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో బాధ్యతలను చేపట్టనున్నారు.