బందోబస్తు సమర్థవంతంగా నిర్వర్తించేందుకు పోలీసు అధికారులు మరియు సిబ్బందికి బ్రీఫింగ్ నిర్వహించిన జిల్లా ఎస్పీ
బందోబస్తు నిర్వహించే సమయంలో విధులు పట్ల పోలీస్ సిబ్బంది అప్రమత్తతో ఉండాలి: జిల్లా ఎస్పీ
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
దోర్నాల మండలంలోని సొరంగాల నుంచి సాగర్ జలాశయానికి నీటిని తరలించే ఫీడర్ కెనాల్ శంకుస్థాపన కార్యక్రమం మరియు మార్కాపురం జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న బహిరంగ సభకు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు హాజరు కానున్న నేపథ్యంలో మంగళవారం జిల్లా ఎస్పీ బందోబస్తు విధులలో పాల్గొనబోయే పోలీసు అధికారులతో బ్రీఫింగ్ సమావేశాన్ని నిర్వహించి బందోబస్తు విధులపై దిశానిర్దేశం చేశారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కార్యక్రమం ప్రారంభం నుండి ముగిసే వరకు బందోబస్తు విధులు నిర్వర్తించే అధికారులు మరియు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వారికి కేటాయించిన స్థలాలకు నిర్దేశించిన సమయానికి విధులకు హాజరు కావాలని సూచించారు. హెలిప్యాడ్, సభ వేదిక, వీఐపీ రూట్ బందోబస్తు, గ్యాలరీలు, మఖ్యంగా పార్కింగ్ ప్రదేశాలలో భద్రతాపరమైన అంశాలపై సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. అవసరమైన చోట్ల బారికేడ్లను ఏర్పాటు చేయాలని, ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని, ఎక్కడా అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా సిబ్బంది తమకు కేటాయించిన పాయింట్ల వద్ద అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. బయట నుండి వచ్చే వాహనాలు కేటాయించిన స్థలాలలోనే పార్కింగ్ చేయించే విధంగా చర్యలు తీసుకోవాలని, ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు. సభ ప్రాంగణంలోకి ప్రవేశించే ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. ఎవరైనా తమ విధులలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ముఖ్యమంత్రి పర్యటనకు వచ్చే ప్రజలు తమకు కేటాయించిన ప్రదేశాల్లోనే వాహనాలను నిలపాలని, అలాగే వెళ్లేటప్పుడు కూడా క్రమపద్ధతిలో వెళ్లాలని సూచించారు. అదేవిధంగా పోలీసు శాఖ విధించిన నిబంధనలు మరియు సూచనలను తప్పనిసరిగా పాటించాలని జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు.సభా ప్రాంగణంకు వచ్చే ప్రజలు మరియు అధికారులు తమ వాహనాలను క్రింది ప్రదేశాలలో పార్క్ చేయవలెను 1)సాధారణ ప్రజల వాహనాలు – L. V. Prasad హాస్పిటల్ ఉత్తర వైపు
2). ఎల్వీ ప్రసాద్ హాస్పిటల్ ఎదురుగా ఉన్న ఖాళీ ప్రదేశాలలో
3)గవర్నమెంట్ అధికారిక వాహనాలు – Sri Sai Balaji School ఉత్తర వైపు
4)ప్రజలు – కాశీనాయన టెంపుల్ సమీపంలో
5) ఇందిరమ్మ కాలనీ, తర్లపాడు రోడ్లో
6)వీఐపీ వాహనాలు – Sri Sai Balaji School దక్షిణ వైపు పార్కింగ్ ప్రదేశంలో సూచించిన ప్రదేశాల్లోనే వాహనాలను పార్క్ చేయవలెను.ముఖ్యమంత్రి మార్కాపురం జిల్లా పర్యటనకు పోలీస్ యంత్రాంగం పకడ్బందీగా భద్రత ఏర్పాట్లు చేపట్టిందని జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ బందోబస్తు నిమిత్తం 2 ఏఎస్పీలు, 9 మంది డిఎస్పీలు, 37 సీఐలు, 90 మంది ఎస్ఐలతో పాటు 1162 మంది హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, హోంగార్డులు, స్పెషల్ పార్టీ సిబ్బంది ఏఆర్ సిబ్బంది, APSP సిబ్బందిని కేటాయించామని జిల్లా ఎస్పీ తెలిపారు.ముఖ్యమంత్రి కాన్వాయ్ ట్రయిల్ రన్ నిర్వహించిన మార్కాపురం జిల్లా ఎస్పీ
జిల్లా ఎస్పీ భద్రతా ఏర్పాట్లను పరిశీలించి హెలిప్యాడ్ నుండి సభా వేదిక జరిగే ప్రాంతం వరకు నిర్వహించిన సి.యం కాన్వాయ్ ట్రయిల్ రన్‌ను పర్యవేక్షించి అధికారులకు మరియు సిబ్బందికి పలు సూచనలు తెలియ చేశారు. ముఖ్యమంత్రి కాన్వాయ్ వచ్చేటప్పుడు బందోబస్త్ సిబ్బంది అత్యంత అప్రమత్తంగా ఉండాలని, కాన్వాయ్ వెళ్లే మార్గంలో ఎలాంటి ఆటంకాలు కలగకుండా స్పెషల్ పార్టీ, పోలీసు బృందాలు, పోలీసు జాగీలాలు, బాంబ్ స్క్వాడ్ బృందాలతో పోలీసులు అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని, కాన్వాయ్ ప్రారంభం నుంచి ముఖ్యమంత్రి కార్యక్రమం పూర్తయ్యేంత వరకూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా బాధ్యతాయుతంగా బందోబస్త్ విధులు నిర్వహిస్తూ సీఎం పర్యటనను విజయవంతంగా పూర్తి చేయాలని ఎస్పీ అధికారులను ఆదేశించారు.జిల్లా ఎస్పీ వెంట ఎస్ఎస్ జి అడిషనల్ ఎస్పీ ఎస్.వి.రమణ,నెల్లూరు అడిషనల్ ఎస్పీ శ్రీమతి సిహెచ్ సౌజన్య, పల్నాడు అడిషనల్ ఎస్పీ వి. సత్తిరాజు, డీఎస్పీలు, సిఐలు మరియు ఎస్ఐలు ఉన్నారు.
