తొలి శుభోదయం న్యూస్ కనిగిరి:-

కనిగిరి మున్సిపల్ కార్యాలయం ఎదుట బుధవారం తెల్లవారుజామున మున్సిపల్ కార్మికులు భారీగా నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగ సీఐటీయూ కనిగిరి మండల కన్వినర్ పి నరేంద్ర మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.వారు మాట్లాడుతూ, 12వ పిఆర్సి ఏర్పాటు చేసి మున్సిపల్ కార్మికులకు ప్రభుత్వమే నేరుగా జీతాలు చెల్లించే విధానం అమలు చేయాలని, అలాగే జీఓఆర్‌టి నెం.1615 ప్రకారం మున్సిపల్ కార్మికులకు పిఆర్సి జీతాలు, డీఏ, ఐఆర్ చెల్లించడంతో పాటు ఇంజినీరింగ్ కార్మికులకు టెక్నికల్ జీతాలు అందజేయాలని కోరారు. అదే విధంగా జీఓ నెం.36 ప్రకారం ఎన్ఎంఆర్, బదిలీ, కోవిడ్, ఎం బుక్, డైలీ వేజ్ కార్మికులు, క్లాప్ డ్రైవర్లకు జీతాలు చెల్లించాలని పేర్కొన్నారు.మున్సిపల్ కార్మికులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో అమలు చేయాలని, రిటైర్డ్ అయిన, అనారోగ్యం పాలైన, మరణించిన కార్మికుల స్థానాల్లో వారి పిల్లలకు ఉద్యోగాలు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. అలాగే 17 రోజుల సమ్మె కాలానికి సంబంధించిన ఒప్పందాలకు సంబంధించి జీఓలను తక్షణమే జారీ చేయాలని, పర్మినెంట్ కార్మికులకు డీఏ బకాయిలు, సరండర్ లీవ్ బకాయిలు వెంటనే చెల్లించాలని కోరారు. నెలకు రూ.24,500/- జీతం పొందుతున్న కార్మికులందరికీ హెల్త్ కార్డులు అందజేయాలని కూడా వారు ప్రభుత్వాన్ని కోరారు.ఈ నిరసన కార్యక్రమంలో ప్రసాద్, చార్లెష్, ఓబయ్య, శేషయ్య, గరటయ్య, ఎలీషా, ప్రభుదాసు, ఆనంద్, బాలస్వామి, బ్రహ్మయ్య, రమణమ్మ, రోజమ్మ, అచ్చమ్మ, ఈశ్వరమ్మ, గురవమ్మ తదితరులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *