తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:-

యర్రగొండపాలెం సర్కిల్ కార్యాలయంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ (CI) గారి అధ్యక్షతన క్రైమ్ రివ్యూ మీటింగ్ (నేర సమీక్షా సమావేశం) నిర్వహించబడింది. ఈ సమావేశంలో సర్కిల్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్ల ఎస్.ఐ.లు మరియు సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా సి.ఐ. గారు స్టేషన్ల వారీగా పెండింగ్‌లో ఉన్న యు.ఐ (Under Investigation) కేసుల పురోగతిని క్షుణ్ణంగా సమీక్షించారు. బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా దర్యాప్తులో వేగం పెంచాలని, సాంకేతిక ఆధారాలతో ఛార్జ్ షీట్లను సకాలంలో దాఖలు చేయాలని ఆదేశించారు.ముఖ్యంగా కోర్టుల ద్వారా జారీ అయి పెండింగ్‌లో ఉన్న నాన్ బెయిలబుల్ వారెంట్ల (NBW) అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలని, పరారీలో ఉన్న నిందితులను వెంటనే అదుపులోకి తీసుకోవాలని స్పష్టం చేశారు. రాబోయే లోక్ అదాలత్ (Lok Adalat) లో గరిష్ట సంఖ్యలో రాజీ పడదగ్గ కేసులను పరిష్కరించి, కక్షిదారులకు సత్వర న్యాయం అందేలా చూడాలని ఎస్.ఐ.లకు దిశానిర్దేశం చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించకుండా, పారదర్శకతతో పనిచేస్తూ శాంతిభద్రతల పరిరక్షణకు కట్టుబడి ఉండాలని సి.ఐ. ఈ సందర్భంగా సిబ్బందిని ఆదేశించారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *