తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-

మార్కాపురం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాయవరం వద్ద ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదం నేపథ్యంలో, రహదారి భద్రతను మెరుగుపరచే దిశగా కుంభాకార దర్పణాలను (Convex Mirrors) మార్కాపురం జిల్లా ఎస్పీ శ్రీ వి.హర్షవర్ధన్ రాజు.,ఐపీఎస్ గారు బుధవారం ఏర్పాటు చేసినారు.ప్రమాదాలకు కారణమయ్యే మలుపులు మరియు దృష్టి లోపం ఉన్న ప్రదేశాలలో డ్రైవర్లకు ముందస్తు హెచ్చరిక అందించేందుకు ఈ దర్పణాలు ఉపయోగపడతాయి. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు దర్పణాల స్థితి, ఎత్తు, కోణం వంటి సాంకేతిక అంశాలను సమీక్షించి, అవసరమైన అన్ని ప్రదేశాల్లో వీటిని ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.అలాగే ప్రమాదాలు సంభవిస్తున్న మలుపులు, జంక్షన్లు, టి.జంక్షన్,వై జంక్షన్, యు టర్న్, విజిబిలిటీ తక్కువగా ఉన్న ప్రదేశాలను గుర్తించిన ప్రాంతాల్లో అదనంగా హెచ్చరిక బోర్డులు,కుంభాకార దర్పణాలు, ప్రతిబింబించే స్ట్రిప్స్ (Reflective Strips), వేగ పరిమితి సూచనలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఇటివల కాలంలో రాయవరం శివారు ప్రాంతంలో బస్సు యాక్సిడెంట్ జరిగిన ప్రదేశాలో కుంభాకార దర్పణాలు అమర్చి ఎస్పీ పరిశీలించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, రహదారి భద్రత ప్రతి పౌరుడి బాధ్యత అని, చిన్న నిర్లక్ష్యాలు పెద్ద ప్రమాదాలకు దారి తీస్తాయని, కుంభాకార దర్పణాల ఏర్పాటు వల్ల వాహనదారులు ఎదురుగా వచ్చే వాహనాలను ముందుగానే గమనించి వేగాన్ని నియంత్రించుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో మరియు వర్షాకాలంలో వీటి ఉపయోగం చాలా ముఖ్యమన్నారు. హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించడం, మద్యం సేవించి వాహనం నడపకపోవడం, వేగ పరిమితులను పాటించడం వంటి నియమాలను తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి చేశారు.ప్రమాదాలను పూర్తిగా నివారించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, జిల్లా పోలీస్ శాఖ తీసుకుంటున్న ఈ చర్యలకు ప్రజల సహకారం కూడా అవసరమని తెలిపారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటిస్తూ, వేగ నియంత్రణ పాటించడం, మలుపులు వద్ద జాగ్రత్తగా వాహనాలు నడపడం, రోడ్డు పరిస్థితులను గమనించడం వంటి అంశాలను కచ్చితంగా అనుసరించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మార్కాపురం డిఎస్పీ యు.నాగరాజు, వై.పాలెం సీఐ కె.అజయ్ కుమార్, కంభం సీఐ మల్లికార్జున రావు,గిద్దలూరు రూరల్ సీఐ రామకోటయ్య, గిద్దలూరు అర్బన్ సురేష్, త్రిపురాంతకం సీఐ అస్సన్, ఎస్సైలు, నేషనల్ హై వే అదికారులు మరియు తదితరులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *