తొలి శుభోదయం న్యూస్ బెస్తవారిపేట:-
ఎటువంటి కాయకష్టం లేకుండా సులభంగా డబ్బు సంపాదించాలని ఆశించి మార్కాపురం జిల్లాలో పలు వాహనాలను లక్ష్యంగా చేసుకొని చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దుండగులను బెస్తవారిపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మార్కాపురం డిఎస్పీ నాగరాజు వివరాలు వెల్లడించారు. కాకినాడ జిల్లాకు చెందిన గంగాధర్ రావు, కడప జిల్లాకు చెందిన ప్రసాద్ గత కొంతకాలంగా కలిసి వాహన చోరీలకు పాల్పడుతున్నారని తెలిపారు.కొన్ని నెలల క్రితం గిద్దలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో టాటా ఇంట్రా ఆటోను చోరీ చేయడంతో పాటు, బెస్తవారిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ట్రాక్టర్ను అపహరించినట్లు తెలిపారు. అంతేకాకుండా మరో నాలుగు ద్విచక్ర వాహనాలను కూడా చోరీ చేసినట్లు వెల్లడించారు.బాధితులు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు, సాంకేతిక ఆధారాలతో నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి సుమారు రూ.14 లక్షల విలువైన చోరీకి గురైన వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు డిఎస్పీ తెలిపారు.ఈ ఇద్దరు నిందితులపై రాష్ట్రవ్యాప్తంగా పలు కేసులు ఉన్నట్లు వెల్లడించారు. అరెస్టు చేసిన దుండగులను కోర్టులో హాజరుపరచనున్నట్లు చెప్పారు.ఈ సమావేశంలో మార్కాపురం జిల్లా డి.ఎస్.పి నాగరాజు గిద్దలూరు రూరల్ సీఐ రామకోటయ్య, బెస్తవారిపేట ఎస్ఐ కె. రవీంద్రారెడ్డి పాల్గొన్నారు….