తొలి శుభోదయం news ప్రకాశం పోలీస్ :-

శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ, రోడ్డు భద్రతను మరింత పటిష్టం చేయడమే లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసులు మరియు మార్కాపురం జిల్లా పోలీసులు సంయుక్తంగా ప్రత్యేక వాహన తనిఖీ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ తనిఖీల్లో భాగంగా ముఖ్య రహదారులు, కూడళ్లు మరియు జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వాహనాలను నిలిపి క్షుణ్ణంగా పరిశీలించారు. వాహనాలకు సంబంధించిన పత్రాలు, డ్రైవింగ్ లైసెన్సులు, హెల్మెట్ వినియోగం, ట్రాఫిక్ నిబంధనల పాటింపు తదితర అంశాలను పోలీసులు తనిఖీ చేశారు. సరైన పత్రాలు లేని వాహనదారులపై చట్టప్రకారం చర్యలు తీసుకున్నారు.ఈ వాహన తనిఖీ కార్యక్రమం ద్వారా నేరాల నివారణ, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు రోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గించడమే ముఖ్య ఉద్దేశమని పోలీస్ అధికారులు తెలిపారు. వాహనదారులు ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాలని, తమ వద్ద అవసరమైన అన్ని పత్రాలు ఉంచుకోవాలని సూచించారు.ప్రజల భద్రతే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని, ఇలాంటి తనిఖీలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. ప్రజలు పోలీస్ శాఖ చేపడుతున్న ఈ కార్యక్రమాలకు సహకరించాలని కోరారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *